మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Shani Ashtottara Shatanama Stotram 1 – శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం


శనైశ్చరాయ శాంతాయ సర్వాభీష్టప్రదాయినే |
శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమః || 1 ||

సౌమ్యాయ సురవంద్యాయ సురలోకవిహారిణే |
సుఖాసనోపవిష్టాయ సుందరాయ నమో నమః || 2 ||

ఘనాయ ఘనరూపాయ ఘనాభరణధారిణే |
ఘనసారవిలేపాయ ఖద్యోతాయ నమో నమః || 3 ||

మందాయ మందచేష్టాయ మహనీయగుణాత్మనే |
మర్త్యపావనపాదాయ మహేశాయ నమో నమః || 4 ||

ఛాయాపుత్రాయ శర్వాయ శరతూణీరధారిణే |
చరస్థిరస్వభావాయ చంచలాయ నమో నమః || 5 ||

నీలవర్ణాయ నిత్యాయ నీలాంజననిభాయ చ |
నీలాంబరవిభూషాయ నిశ్చలాయ నమో నమః || 6 ||

వేద్యాయ విధిరూపాయ విరోధాధారభూమయే |
భేదాస్పదస్వభావాయ వజ్రదేహాయ తే నమః || 7 ||

వైరాగ్యదాయ వీరాయ వీతరోగభయాయ చ |
విపత్పరంపరేశాయ విశ్వవంద్యాయ తే నమః || 8 ||

గృధ్నవాహాయ గూఢాయ కూర్మాంగాయ కురూపిణే |
కుత్సితాయ గుణాఢ్యాయ గోచరాయ నమో నమః || 9 ||

అవిద్యామూలనాశాయ విద్యాఽవిద్యాస్వరూపిణే |
ఆయుష్యకారణాయాఽఽపదుద్ధర్త్రే చ నమో నమః || 10 ||

విష్ణుభక్తాయ వశినే వివిధాగమవేదినే |
విధిస్తుత్యాయ వంద్యాయ విరూపాక్షాయ తే నమః || 11 ||

వరిష్ఠాయ గరిష్ఠాయ వజ్రాంకుశధరాయ చ |
వరదాఽభయహస్తాయ వామనాయ నమో నమః || 12 ||

జ్యేష్ఠాపత్నీసమేతాయ శ్రేష్ఠాయ మితభాషిణే |
కష్టౌఘనాశకర్యాయ పుష్టిదాయ నమో నమః || 13 ||

స్తుత్యాయ స్తోత్రగమ్యాయ భక్తివశ్యాయ భానవే |
భానుపుత్రాయ భవ్యాయ పావనాయ నమో నమః || 14 ||

ధనుర్మండలసంస్థాయ ధనదాయ ధనుష్మతే |
తనుప్రకాశదేహాయ తామసాయ నమో నమః || 15 ||

అశేషజనవంద్యాయ విశేషఫలదాయినే |
వశీకృతజనేశాయ పశూనాం పతయే నమః || 16 ||

ఖేచరాయ ఖగేశాయ ఘననీలాంబరాయ చ |
కాఠిన్యమానసాయాఽఽర్యగణస్తుత్యాయ తే నమః || 17 ||

నీలచ్ఛత్రాయ నిత్యాయ నిర్గుణాయ గుణాత్మనే |
నిరామయాయ నింద్యాయ వందనీయాయ తే నమః || 18 ||

ధీరాయ దివ్యదేహాయ దీనార్తిహరణాయ చ |
దైన్యనాశకరాయాఽఽర్యజనగణ్యాయ తే నమః || 19 ||

క్రూరాయ క్రూరచేష్టాయ కామక్రోధకరాయ చ |
కళత్రపుత్రశత్రుత్వకారణాయ నమో నమః || 20 ||

పరిపోషితభక్తాయ పరభీతిహరాయ చ |
భక్తసంఘమనోఽభీష్టఫలదాయ నమో నమః || 21 ||

ఇత్థం శనైశ్చరాయేదం నామ్నామష్టోత్తరం శతమ్ |
ప్రత్యహం ప్రజపన్మర్త్యో దీర్ఘమాయురవాప్నుయాత్ || 22 ||

ఇతి శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రమ్ |


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.